Friday 26 August 2011

సామాన్యుడి వేదన

వాడొచ్చి ఇదిస్తా అన్నడు వీడొచ్చి అదిస్తా అన్నడు  
ఏదో సేస్తారని ఓటు మేమేస్తే కొడుకులు కోట్లు మింగేసిన్రు
ఇల్లిస్తా అని మాటిచిండ్రు ఉన్న ఇల్లు గుల్ల చేసిండ్రు 
పచ్చ జెండా ఓడు పల్లెల్ని మరిచిండు పట్నం ఎనక పరుగు తీసిండు
సెయి అందిస్తన్నోడు సివరికి ఖాళి చేయి సూపెడ్తుండు

వంతెనలు కడ్తమంటిరి ఉన్నదంత ఊడ్స్కపోతిరి
శరం లేని బతుకులు మింగ మెతుకు లేకుండ సేస్తుండ్రు 
మన్నెం మనుషులు మందులు లేక బిక్కు బిక్కు మంటుంటే 
కుక్కల్ లెక్క కక్కిన కూడుకు కొట్టుక సస్తుండ్రు 
తండాలు అండ లేక అలమటిస్తునాయి, అగుపిస్త లేదా రా 

జనం కడుపు కొట్టి సొంత గూటికి టెంకాయ కొట్టుకుండ్రు
ఎంగిలి మెతుకులు ఎరుకుతినే కాకి నయం కదా రా 
కూసింత సదుకుంటే పట్నంల కొలువు అంటిరి
ఆకలికి ఉన్న కడుపు పిడసకట్టుకు పోతుంటే 
నాల్కే మీద అ ఆ లు ఎట్ల నిలబడతాయి రా 

ఆనాటి తెల్లోడికి సలాం కొడత, ఆడు రొమ్ము మీద గుద్దిండు 
మీరు మా ఒళ్ళు అని గద్దె మీద కూస పెడ్తే వెన్ను పోటు పోడిసిండ్రు
ఇదేం సతంత్రంరో, తెల్లోడు వచ్చి దోసుకుని పోయిండు 
ఇప్పడు మనోళ్ళు దోసుకు పోయి తెల్లోని కాడ దాశి పెడుతుండ్రు  
ఖద్దరు సోక్కా కి గదర్ వాసన పట్టించిన్రు కదరా 

ఆప్పట్ల నాయకుడంటే జనం కోసం పని చేసేటోడు అని సధివినం
గిప్పుడు రౌడిఇజం, గుండాఇజం కనీస అర్హత అయిపోయింది లే 
సిన్నప్పుడు అమ్మ చెప్పింది కొడుకా సదుకుంటే బుచోడు కూడా సలాం కొట్టి తప్పుకుంటడు రా అని 
కని ఇయ్యాల బాగా సదుకున్నోడు కిల్లి కొట్టు మల్లి గానికి కూడా సలాం కొట్టి బతకాల్సి ఒస్తుంది 

సర్కారి ధవఖానల ఆకలికి బిడ్డ ఏడుస్తుంటే, తిండి సరిగ లేక అమ్మ రొమ్ము ఖాళి
ప్రైవేటు ఒని కాడికి పోదాం అంటే కాసులు లేక పాయె 
ఇల్లు కట్టుకోనీకే బల్ల కింద పైసల్ ఇయ్యాలె 
మల్ల ఆ ఇంటికి నీళ్ళు గావాలంటే పైసల్ ఇయ్యాలె, ఎలుతురు కావాలంటే పైసల్ ఇయ్యాలె
అన్ని సేసినంక ఎవడొచ్చి కబ్జా పెడతాడో అని భయపడి సావాలె

ఓరి గాంధీ ఓడ నువ్వు మల్ల పుట్టి ఈలన్నిఎలగోట్ట రాదే అని ఎడుకుంటే 
సి సి నేనూ ఒస్తే నన్ను కూడా ఖరాబ్ సేస్తరు అని ధడుసుకుంటుంన్నడు
వహ్ రే ఈనాటి నాయాకుడా దారి సూపెట్టేనోడే దారిన పోయేందుకు ధడుసుకుంటుంన్నడు
ఇంక సాలురా దండు కున్నది మా రక్తాన్ని కూడా పిండుకు తాగిన్రు కద రా 
కాటికి కాలీ సాచిన హజారే తిండి మాని కోట్లాడ్తుండు
ఆయన మొదలెట్టిండు, ఇక ఇంటికి ఒకడు ఆయన వెంట చేరి 
కొడకా మీ నడ్డి ఇరిచే దాక వెనక్కి తగ్గరు ........

Saturday 2 July 2011

ఓటమి మాటున విజయం.....

గడిచిన కాలం పద పద మని తరుముతున్నది, 
గమ్యం జాడలను వెతుకుతూ పయనం మొదలైనది, 
ఓటమి పంచిన అనుభవం రేపటి గెలుపుకు నాంది పలికింది, 
రగులుతున్న గుండె వెను తిరిగి చూడనంటున్నది,
ప్రతి శ్వాస జయం కొరకు తపిస్తున్నది, 
రాలిన ప్రతి కన్నీటి చుక్క ఇంధనం అయి నడిపిస్తున్నది, 
ఉప్పెనగా ఎగిసి పడుతున్న ఆవేశం, 
ఆలోచనలకు పదును పెట్టి పోరాటం చేయమంటున్నది,
చేయూత నిచ్చిన వారిని మరవక, 
వంచించిన వారిని క్షమించక, 
పద పద రా సోదర పట్టు సడలించక. 

Thursday 19 May 2011

బంగారు తల్లి ..నా చెల్లి

పసి పాప గా ఈ లోకాన అడుగిడి,
అమ్మ ఒళ్లో అల్లారు ముద్దుగా, నాన్న కంటి పాపగా
బుడి బుడి నడకలతో సడి చేయక ఎదిగి
అందరిని మరిచి ఆతని పంచన చేరింది..నా చెల్లి

నాన్న అనుభవాన్ని అనుసరిస్తూ
అమ్మ లోని కళల్ని ఒడిసి పడుతూ
అన్నయ అడుగులని గమనిస్తూ, 
జ్ఞాపకాలను మాకు విడిచి ఆతని పంచన చేరింది..నా చెల్లి

బడిలో చేరి అక్షరాలతో ఆడుకుంటూ
పదాలని పాటలుగా మార్చే ఎత్తులకు ఎదిగింది
పిల్లి మొగ్గలు మాని రంగవల్లులు నేర్చింది
ఎన్నో కలల్ని మాకు చూపి ఆతని పంచన చేరింది ..నా చెల్లి

అమ్మని మరిపించు ఆప్యాయత అత్తలోన చూసింది
నాన్న చూపు వంటి గారాబం మామ వద్ద అందుకుంది
ఎన్నో కొత్త ఆనందాల్ని అందించు సఖుడి తోడు గెలిచింది 
పుట్టినింట మెట్టినింట సుఖ సంతోషాలు నింపింది....నా చెల్లి

Thursday 12 May 2011

పెళ్లి చూపులు ..........వలపు గాలాలు..

మరువలేకున్నా నిను తొలిసారి చుసిన ఆ క్షణం
బంధీనయినాను మరుక్షణం నీ చూపుల చెరసాలలో
మరల  మరల  చూడాలని మనసు నన్ను తరిమింది
తరిచి తరిచి చూస్తే తెర చాటున దాగి ఉన్న నీ అందం తొంగి తొంగి పలకరించింది

తొలి సారి నీతో మాట  కలిపిన ఆ తరుణం
తెరదించింది, తోడుకై  నా అన్ని నాళ్ళ నిరీక్షణకు
మొదటిసారి ప్రేమ అను భావం నన్ను తాకింది
నీ చేయి అందుకోమని పదే పదే కోరింది

నీ చీర కట్టు ఒడిసి పట్టింది నా హృదయాన్ని
నీవే నేనైనాను నీ నవ్వు చూసి
కాటుక కళ్ళ మాటున దాగి ఉన్న ఊసుల గుస గుస లు
వలపుల వలయాన్ని విసిరాయి నా మనసు పై
నా కనులు కాళ్ళకు బంధాలు వేసాయి నిను వీడి వెల్ల వద్దంటూ

భారమయిన మనసుతో తీయనయిన ఊహలతో

నీతో ఏడడుగుల బంధాన్ని ఊహించుకుంటూ
నేనూ, నువ్వు  మనం అయ్యే రోజును తలుచుకుంటూ
నా పాదం కదిలింది నీ ఇంటి లోగిలి నుంచి.....

Tuesday 12 April 2011

నా ఊపిరి...

నీ తోడు కోరుతోంది వయసు ..... 
        నీ  ఛాయ వీడనంటుంది మనసు ,
 వెన్నంటి ఉంటా నీ  వెంట అనుక్షణం ....    
       తపిస్తున్నానీ కోసం ప్రతి క్షణం ,
నడిపించు నన్ను నా విజయాలకు  ఊపిరివయి ....
         నా పోరాటాలకు సారధివై
.

Thursday 7 April 2011

పరువం......

నీ మేను పరువాలు చూసి  మయూరమే  ఈర్ష్య  పడుతుంటే ....
                   నా ఊహల  పరుగును ఆపేదెలా ,
నీ  మేను ఛాయ చూసి గులాబీలు సిగ్గు పడుతుంటే .....
                  నా  మనసుకు  పగ్గాలు  వేసెదేలా ,
మచ్చలున్న చందమామని చూపి  గగనం  ఎగిసి  పడుతుంటే ....
                  శశి  ని  మరిపించు  నా  చెలి  అందం  చూపి  నేను  గర్వ  పడనేలా.....

Wednesday 6 April 2011

మువ్వల సవ్వడి ...

న  మువ్వల  సవ్వడి  నా  పదాలకు  పదనిసలు  నేర్పింది .....
      నా  కలం  కదిలింది  తన  కలువ  కళ్ళ  సైగలతో .
తన  రాక  నింపింది  సప్త  వర్ణాలు  నా  లోగిలి  లో ....
      నా  మనసుకు  గాలం  వేసింది  తన  వలపు  హరివిల్లులతో .
       








రాధికా సోయగం....

చిరు  హాసం  చిందించి ....
    మయూరి  హొయలు  పలికించు ,
వేచి  ఉంటా  వసంతం  వలె  సన్న  జాజి  కొరకు ...
    రా-అధిక  సోయగాలతో  నిశీధిని  త్రోలె  కిరనానివయి.

నా చెలి

సద్దు   చేయకుమా చిరు  గాలి ....
    సేద  తీరుతున్నది  నా చెలి,
నా  దూత  వయి  చేరుకో  నా  సఖి   చెక్కిలి ...
    జోల  పాటగా  అందించు  నా  అధరాంజలి.
.