Friday 24 February 2012

తండ్రి ఆవేదన .....

ఆకలి ఎగదోస్తుంటే, గూడు మండుతుంటే 
విద్యని నమ్ముకుంది  బతుకు 
అమ్మ కట్టేలంముతుంటే 
అక్షరాలను  నమ్ముకుంది

నాడు జాడ లేని ఊపిరి 
నేడు పది మందికి ఊపిరి ఊదుతుంది 
పుల్ల పుల్ల ఏరి పొయ్యి  ఎలిగించుకుంటే 
పుట్టినోడు నేడు పుట్టేడన్నం పెట్ధలేడు

అయిదు రూపాలకు ఆరేళ్ళ ప్రాయాణ
ఏడు స్టేషన్లు ధాటి పోతి
కోటి సంపాయించినాక
ఏమి సేస్తివని కొడుకు నిలదీసే 

వాని బాధ ఎదురీత 
నా ఎదురు చూపు చేయూత 
మసక బారుతున్న ప్రాయం 
మరుగుతన్న రక్తంతో పోటి పడుతుంది

ఆవేశానికి నా అనుభవాన్ని జోడించమని కోరుతున్న 
చేతి కొచ్చిన కొడుకు, చేయి అందిస్తే
మరాన్ని నమ్ముకున్న గుండె
మరింత ఊరకలేస్తదని విన్నవిస్తున్న.....