Friday 26 August 2011

సామాన్యుడి వేదన

వాడొచ్చి ఇదిస్తా అన్నడు వీడొచ్చి అదిస్తా అన్నడు  
ఏదో సేస్తారని ఓటు మేమేస్తే కొడుకులు కోట్లు మింగేసిన్రు
ఇల్లిస్తా అని మాటిచిండ్రు ఉన్న ఇల్లు గుల్ల చేసిండ్రు 
పచ్చ జెండా ఓడు పల్లెల్ని మరిచిండు పట్నం ఎనక పరుగు తీసిండు
సెయి అందిస్తన్నోడు సివరికి ఖాళి చేయి సూపెడ్తుండు

వంతెనలు కడ్తమంటిరి ఉన్నదంత ఊడ్స్కపోతిరి
శరం లేని బతుకులు మింగ మెతుకు లేకుండ సేస్తుండ్రు 
మన్నెం మనుషులు మందులు లేక బిక్కు బిక్కు మంటుంటే 
కుక్కల్ లెక్క కక్కిన కూడుకు కొట్టుక సస్తుండ్రు 
తండాలు అండ లేక అలమటిస్తునాయి, అగుపిస్త లేదా రా 

జనం కడుపు కొట్టి సొంత గూటికి టెంకాయ కొట్టుకుండ్రు
ఎంగిలి మెతుకులు ఎరుకుతినే కాకి నయం కదా రా 
కూసింత సదుకుంటే పట్నంల కొలువు అంటిరి
ఆకలికి ఉన్న కడుపు పిడసకట్టుకు పోతుంటే 
నాల్కే మీద అ ఆ లు ఎట్ల నిలబడతాయి రా 

ఆనాటి తెల్లోడికి సలాం కొడత, ఆడు రొమ్ము మీద గుద్దిండు 
మీరు మా ఒళ్ళు అని గద్దె మీద కూస పెడ్తే వెన్ను పోటు పోడిసిండ్రు
ఇదేం సతంత్రంరో, తెల్లోడు వచ్చి దోసుకుని పోయిండు 
ఇప్పడు మనోళ్ళు దోసుకు పోయి తెల్లోని కాడ దాశి పెడుతుండ్రు  
ఖద్దరు సోక్కా కి గదర్ వాసన పట్టించిన్రు కదరా 

ఆప్పట్ల నాయకుడంటే జనం కోసం పని చేసేటోడు అని సధివినం
గిప్పుడు రౌడిఇజం, గుండాఇజం కనీస అర్హత అయిపోయింది లే 
సిన్నప్పుడు అమ్మ చెప్పింది కొడుకా సదుకుంటే బుచోడు కూడా సలాం కొట్టి తప్పుకుంటడు రా అని 
కని ఇయ్యాల బాగా సదుకున్నోడు కిల్లి కొట్టు మల్లి గానికి కూడా సలాం కొట్టి బతకాల్సి ఒస్తుంది 

సర్కారి ధవఖానల ఆకలికి బిడ్డ ఏడుస్తుంటే, తిండి సరిగ లేక అమ్మ రొమ్ము ఖాళి
ప్రైవేటు ఒని కాడికి పోదాం అంటే కాసులు లేక పాయె 
ఇల్లు కట్టుకోనీకే బల్ల కింద పైసల్ ఇయ్యాలె 
మల్ల ఆ ఇంటికి నీళ్ళు గావాలంటే పైసల్ ఇయ్యాలె, ఎలుతురు కావాలంటే పైసల్ ఇయ్యాలె
అన్ని సేసినంక ఎవడొచ్చి కబ్జా పెడతాడో అని భయపడి సావాలె

ఓరి గాంధీ ఓడ నువ్వు మల్ల పుట్టి ఈలన్నిఎలగోట్ట రాదే అని ఎడుకుంటే 
సి సి నేనూ ఒస్తే నన్ను కూడా ఖరాబ్ సేస్తరు అని ధడుసుకుంటుంన్నడు
వహ్ రే ఈనాటి నాయాకుడా దారి సూపెట్టేనోడే దారిన పోయేందుకు ధడుసుకుంటుంన్నడు
ఇంక సాలురా దండు కున్నది మా రక్తాన్ని కూడా పిండుకు తాగిన్రు కద రా 
కాటికి కాలీ సాచిన హజారే తిండి మాని కోట్లాడ్తుండు
ఆయన మొదలెట్టిండు, ఇక ఇంటికి ఒకడు ఆయన వెంట చేరి 
కొడకా మీ నడ్డి ఇరిచే దాక వెనక్కి తగ్గరు ........